Harish Rao Slams Revanth Govt: తెలంగాణ ప్రభుత్వం జీవవైవిధ్య బోర్డు సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఉద్యోగుల ఆర్థిక బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు(Harish Rao) అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఆలస్యం మరియు సాకులతో ప్రభుత్వం రోజులు గడుపుతుందని ఎద్దేవా చేశారు. వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతం లేకుండా తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు సిబ్బంది, శాస్త్రవేత్తల నుంచి గ్రౌండ్ సిబ్బంది వరకు నిస్సహాయ స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను కేటాయించినప్పటికీ, ఈ అవసరమైన నిధులను విడుదల చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు హరీష్ రావు.
ఉద్యోగులు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ నుంచి పిల్లల చదువు వరకు ఉద్యోగులు ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పిల్లల చదువులు మాన్పించే దుస్థితి నెలకొందని హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వపై మండిపడ్డారు.
Also Read: SSC GD Recruitment 2024 : 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్