Site icon HashtagU Telugu

Group 2 New Dates : గ్రూప్-2 ఎగ్జామ్స్ కొత్త తేదీలు ఇవే..

TGPSC NEW UPDATE

Group 2 New Dates : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు  టీఎస్ పీఎస్సీ తెలిపింది. వాస్తవానికి ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను.. ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో నవంబరుకు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్  నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలవగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను(Group 2 New Dates)  భర్తీ చేయనున్నారు.

Also read : Honey Benefits: ఈ సీజనల్ వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం.. తేనెతో కలిగే లాభాలు ఇవే..!

Exit mobile version