TSPSC Group 2 Exam : తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష వాయిదా

డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది.

  • Written By:
  • Publish Date - July 19, 2024 / 02:56 PM IST

TSPSC Group 2 Exam : ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. డిసెంబర్‌లో నిర్వహించన్ను గ్రూప్‌-2 రాతపరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బోర్డు వెల్లడించింది.

కాగా, మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్సీ గత ఏడాది గ్రూప్‌ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. పరీక్షలు వాయిదా పడినా.. నిరుద్యోగులు కోరుతున్నట్లు పోస్టులు సంఖ్య పెరుగుతుందో.. లేదో మాత్రం సర్కార్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.

Read Also: Man Stole Electricity: విద్యుత్ దొంగతనం.. కూతురు కోసం తండ్రి అత్యాశ

 

 

 

Follow us