Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రిత్విక్‌‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..

తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్‌(Raja Rithvik)  వయసు 21 ఏళ్లు.

Published By: HashtagU Telugu Desk
Telangana Grandmaster Raja Rithvik Rajavaram Bronze Medal International Chess Championship

Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌‌కు మరో ఘనత దక్కింది. ఫ్రాన్స్‌లోని క్యాపెల్ లా గ్రాండేలో జరిగిన ‘క్యాపెల్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ 2025’లో ఆయన మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రిత్విక్‌ 9 రౌండ్‌లలో  పాల్గొని 7 పాయింట్లు సాధించాడు.  ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ బోయెర్‌ మహెల్‌ గోల్డ్ మెడల్‌ను గెల్చుకున్నారు. భారత్‌‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఇనియాన్‌ పన్నీర్‌సెల్వం రజత పతకం సాధించారు. 26 దేశాలకు చెందిన 533 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

Also Read :Thodasam Kailash: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్‌’‌లో తెలంగాణ టీచర్‌.. తొడసం కైలాశ్ ఎవరు ?

రాజా రిత్విక్‌‌ నేపథ్యం.. 

  • తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్‌(Raja Rithvik)  వయసు 21 ఏళ్లు.
  • రిత్విక్ కుటుంబీకులు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందినవారు. రిత్విక్‌ కుటుంబం వరంగల్‌లో స్థిరపడింది.
  • రిత్విక్‌ చెస్‌ కెరీర్‌ కోసం తల్లి దీపిక తన లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలేశారు.
  • రిత్విక్‌ ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడటం మొదలుపెట్టాడు.
  • తొలుత ఒక వేసవి శిక్షణ శిబిరంలో రిత్విక్‌కు చెస్‌లో ట్రైనింగ్ ఇప్పించారు.
  • తదుపరిగా రిత్విక్‌కు హైదరాబాద్‌‌లో చెస్ ట్రైనింగ్ ఇప్పించారు. కోచ్‌ రామరాజు దగ్గర ఆయన చెస్ నేర్చుకున్నారు.
  • 13 ఏళ్ల వయసులోనే అండర్‌-13, అండర్‌-17 జాతీయ స్థాయి టైటిల్స్‌ను రిత్విక్ గెల్చుకున్నాడు.
  • 2018లో ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో చెస్ విభాగంలో 5 గోల్డ్ మెడల్స్ గెలిచాడు.
  • 14 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాను రిత్విక్ పొందారు.
  • 2019 డిసెంబరులో రిత్విక్‌ తన తొలి గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ సాధించాడు. 2021 ఆగస్టులో రెండో నార్మ్‌ సాధించాడు. 2021 సెప్టెంబరులో మూడో నార్మ్‌ అందుకున్నాడు.
  • కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టగానే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించే లక్ష్యంతో ఐరోపాకు రిత్విక్ వెళ్లాడు. అక్కడ వరుసగా టోర్నీల్లో పాల్గొన్నాడు. 20 రోజుల్లోనే రెండు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్‌ను పొందాడు.
  • 2021లో రిత్విక్‌కు చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది.
  • తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మూడో చెస్‌ ఆటగాడు రిత్విక్.
  • మన దేశంలో 70వ గ్రాండ్‌మాస్టర్‌ రిత్విక్.
  Last Updated: 23 Feb 2025, 02:57 PM IST