Site icon HashtagU Telugu

Telangana Debt : తెలంగాణ అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తారా.. ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం : కేటీఆర్

Ktr Telangana Govt Debt Brs Congress

Telangana Debt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ‘‘రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పులు కావడానికి కేసీఆరే కారణం. ఆయనే తెలంగాణను దివాలా తీయించారు’’  అని ఇటీవలే అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. దీనిపై తాజాగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నేతలకు అలవాటై పోయిందన్నారు.  రాష్ట్రానికి ఉన్న అప్పులపై తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read :Telangana Rice : తెలంగాణ బియ్యమా మజాకా.. క్యూ కడుతున్న రాష్ట్రాలు, దేశాలు!

‘‘తెలంగాణకు రూ. 7 లక్షల కోట్ల అప్పులు(Telangana Debt) ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవికత లేదు. అది వట్టి అబద్ధం. ఇలాంటి సమాచారంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు నిరసనగా మేం అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్‌ను  ప్రవేశపెడతాం’’ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా  కేటీఆర్ ప్రకటించారు.  ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర అప్పు కేవలం రూ. 3.89 లక్షల కోట్లే. కానీ రూ.7లక్షల కోట్ల అప్పు ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐకి చెందిన  ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదికలోనూ తెలంగాణ అప్పులు రూ. 3.89 లక్షల కోట్లే అని స్పష్టమైన ప్రస్తావన ఉందని కేటీఆర్ చెప్పారు.

Also Read :Allu Arjuns Uncle : బీఆర్ఎస్ లేదా బీజేపీ.. అల్లు అర్జున్ మామ పార్టీ మారబోతున్నారా ?

‘‘డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు ఆయన భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం తరఫున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.