Telangana: తెలంగాణ ప్రభుత్వం జులై 30 మంగళవారం నుంచి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ రెండో దశను అమలు చేయనుంది. దీనిని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా 7 లక్షల మంది రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు.
జూలై 12న అమలులోకి వచ్చిన రైతు రుణమాఫీ మొదటి దశలో రాష్ట్రంలోని 11.5 లక్షల మంది రైతుల రుణాల ఖాతాల్లో రూ.6,093 కోట్లు జమ అయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల దాదాపు 17,000 మంది రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని యోచిస్తోంది.
2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణను రోల్ మోడల్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ . ఈ 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనుంది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను క్లియర్ చేసేందుకు రేవంత్ రెడ్డి జూలై 18న రూ.6,098 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ అవుతాయని, ఆగస్టు నెలాఖరులోపు మూడో దశలో రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు.
Also Read: Pithapuram : జనసేనలోకి పెండెం దొరబాబు..?