Site icon HashtagU Telugu

Telangana: హరితహారం పేరు మార్పు: ఇక వనమహోత్సవం

Telangana

Telangana

Telangana: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది మొక్కలను నాటింది. పట్టణ, పల్లెలో హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లింది. రహదారుల వెంబడి నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి నీడనిస్తున్నాయి. అయితే నాటిన మొక్కల్ని సంరక్షించే క్రమంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ కార్యక్రమం బృహత్తరంగా సాగింది. కాగా హరితహారం పేరును మారుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం పేరును మారుస్తూ వన మహోత్సవంగా నామకరణం చేసింది రేవంత్ సర్కార్.

నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది.1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వన మహోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, స్టీరింగ్‌ కమిటీలను నియ మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జిల్లా సమన్వ య కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌ గా వ్యవహరిస్తారు. కాగా ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించ నుండగా.. ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండనున్నారు.

Also Read; Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Exit mobile version