TET Fee Hike : వామ్మో ‘టెట్’ ఫీజులు.. ఒక పేపరుకు వెయ్యి, రెండు పేపర్లకు 2వేలు!

TET Fee Hike : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది.

Published By: HashtagU Telugu Desk
TS TET 2023

Tet Notification

TET Fee Hike : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది. టెట్‌కు సంబంధించి గతంలో ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా, దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను మార్చి 22న విడుదల చేసింది. ఇందులో టెట్ ఫీజులు, అర్హతల వివరాలు ఉన్నాయి.  రాష్ట్రంలో మార్చి 15న  టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు(TET Fee Hike) నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ముఖ్యమైన తేదీలివీ..

  • టెట్-2024  ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు  ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.04.2024
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2024 నుంచి
  • టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 – 03.06.2024
  • పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి  11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి  సాయంత్రం 4.30 వరకు
  • టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024

Also Read : Neha Sharma : రాజకీయాల్లోకి ‘చిరుత’ బ్యూటీ.. ఆ లోక్‌సభ సీటు నుంచి పోటీ!

  • టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
  • టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.

Also Read :Ajith: వారి కోసం ప్రేమతో బిర్యానీ చేస్తున్న హీరో అజిత్.. వీడియో వైరల్?

  Last Updated: 23 Mar 2024, 06:08 PM IST