Site icon HashtagU Telugu

MLC Nominations Rejected : సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ

TSRTC Bill

Governor Tamilisai Vs Cm Kcr

MLC Nominations Rejected : తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన వారి వివరాలతో కేసీఆర్ సర్కారు పంపిన లిస్టును రెజెక్ట్ చేశారు. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి గవర్నర్ దగ్గరికి తెలంగాణ ప్రభుత్వం ఒక లిస్టును పంపించింది. కొంత కాలంగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ తమిళిసై.. ఇప్పుడు దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర సర్కారుకు సమాచారాన్ని అందించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థులను కేసీఆర్ సర్కారు  ఎంపిక చేయలేదని  గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు.

Also read : TDP : ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కానున్న కుటుంబ‌స‌భ్యులు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కు తమిళిసై సూచించారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి తగినంత అర్హత లేదని గవర్నర్ తెలిపారు. నిబంధనల ప్రకారం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక కావడానికి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు అర్హత లేదని గవర్నర్ (MLC Nominations Rejected)  స్పష్టం చేశారు.