ఇల్లు నిర్మించుకోవడం (House Building ) రోజురోజుకు ఖరీదైన వ్యవహారమవుతోంది. ముఖ్యంగా ఇసుక (Sand) కొరత వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మార్కెట్(Black Market)లో అధిక ధరలకు ఇసుకను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఇంటింటికే ఇసుక సరఫరా చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు శాండ్ బజార్‌లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక శాండ్ బజార్‌ను ప్రారంభించగా, మరికొన్ని చోట్ల త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
DK Aruna : డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఎట్టకేలకు దొరికాడు
ప్రస్తుతం మెట్రిక్ టన్ను దొడ్డు ఇసుక ధర రూ.1,600గా, సన్న ఇసుక ధర రూ.1,800గా నిర్ణయించారు. దీనికి అదనంగా ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఉంటాయి. ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక కావాల్సిన వినియోగదారులు టీజీఎండీసీ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. త్వరలోనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా, నేరుగా ఇంటికే సరఫరా చేసే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా బ్లాక్ మార్కెట్ దందాలను అరికట్టడంతో పాటు, ప్రజలకు న్యాయమైన ధరలకు ఇసుక అందించే అవకాశముంది.
Hydraa : హైడ్రా పేరుతో వసూళ్ల దందా – కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ నగర ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా బ్లాక్ మార్కెట్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఇసుక లభ్యతను పెంచే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని శాండ్ బజార్లు ఏర్పాటు చేసి, తెలంగాణలో ఎక్కడైనా ఇసుక సరఫరా చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.