New Mandals : మరో 3 కొత్త మండలాలు.. ఏ జిల్లాల్లో అంటే..

New Mandals :  కొత్తగా మరో 3 మండలాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.

Published By: HashtagU Telugu Desk
Rs 1 lakh assistance for minorities-telangana govt

New Mandals :  కొత్తగా మరో 3 మండలాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. కొత్తగా నిర్మల్‌ జిల్లాలో రెండు మండలాలు(మాలెగావ్‌, బెల్తాడోరా), వనపర్తి జిల్లాలో ఒక మండలాన్ని(ఏదుల)  ఏర్పాటు చేయనున్నారు. వనపర్తి జిల్లాలో ఏర్పాటుకానున్న ఏదుల మండలం పరిధిలో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలు ఉంటాయి. నిర్మల్‌ జిల్లాలో ఏర్పాటయ్యే మాలేగావ్‌ మండలంలో సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్‌, గోదాపూర్‌, కుప్టి, వర్ని గ్రామాలను కలపాలని ప్రతిపాదించారు.

We’re now on WhatsApp. Click to Join

నిర్మల్‌ జిల్లాలో ఏర్పాటయ్యే బెల్తాడోరా  మండలంలోో ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్‌, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలను కలపాలని ప్రతిపాదించారు. ఈమేరకు వివరాలతో తెలంగాణ సర్కారు ప్రైమరీ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది.  ఈ మండలాల్లో గ్రామాల కూర్పు, ఇతర అంశాలపై  పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ (New Mandals) జారీ చేయనున్నారు.

Also read :Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

  Last Updated: 04 Oct 2023, 06:56 AM IST