TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) అనేక మార్పులు చేర్పులు చేస్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారిని బదిలీలు చేస్తూ వారి స్థానాల్లో వేరే వారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Daddurlu Sridhar Babu) సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌ (Dr Shailaja Ramaiyer IAS)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్‌ యవజన […]

Published By: HashtagU Telugu Desk
Telangana Government Has As

Telangana Government Has As

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) అనేక మార్పులు చేర్పులు చేస్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారిని బదిలీలు చేస్తూ వారి స్థానాల్లో వేరే వారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Daddurlu Sridhar Babu) సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌ (Dr Shailaja Ramaiyer IAS)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్‌ యవజన సర్వీసులు, పర్యాటకశాఖ మఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే అమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంధనశాఖ కార్యదర్శిగా, ట్రాన్స్‌కో, జన్‌ కో సీఎండీగా రిజ్వికి బాధ్యతలు అప్పగించింది. ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియమించారు.

ముఖ్యంగా కేంద్రం పరిధిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి.. రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా అమ్రపాలి నియామకం ఆసక్తిగా మారింది.

Read Also : Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్

  Last Updated: 14 Dec 2023, 07:14 PM IST