తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో రేషన్ కార్డుల(Ration Card) విషయమై అనేక షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కుటుంబాల వివరాలను పరిశీలించగా, దాదాపు 96 వేల రేషన్ కార్డులు అనుమానాస్పదంగా మారాయి. ఇప్పటివరకు 6,000కి పైగా కార్డులు అర్హత లేనివిగా గుర్తించారు. పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో భారీ స్థాయిలో పరిశీలన చేయడం గమనార్హం.
Pawan Kalyan : “సింహాన్ని కెలకొద్దు” అంటూ చిత్రసీమకు బండ్ల గణేష్ హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉండగా, వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. అయితే అందులో 1.6 లక్షల మంది రేషన్ వినియోగించకపోవడం అధికారులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని ప్రాంతాల్లో వందేళ్ల వయస్సు కలిగి మరణించినవారు ఇంకా లబ్ధిదారుల జాబితాలో ఉండటం, కొందరికి రెండు వేర్వేరు కార్డుల్లో పేర్లు ఉండటం లాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సూర్యాపేట, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాల్లో విచారణ వేగంగా కొనసాగుతోంది.
ఈ విచారణ అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వరుసగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారు, అర్హత లేనివారిగా తేలిన వారి రేషన్ కార్డులు రద్దు చేసే దిశగా పౌరసరఫరాల శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే, KYC చేయించుకోని కార్డులను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.