Site icon HashtagU Telugu

Singareni Employees : సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government announced bonus for Singareni workers

Telangana government announced bonus for Singareni workers

Telangana govt announced bonus for Singareni workers : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను బోనస్ గా ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త అందించింది. రూ.4,701 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ లో రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి 1 లక్షా 90వేలు బోనస్ ఇస్తున్నాం. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.6 వేలు ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటి సారి అన్నారు. గత ఏడాది కంటే 20 వేలు అధికంగా బోనస్ ఇచ్చాం. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారు’ అని వ్యాఖ్యానించారు.

Read Also: Tirumala Laddu Controversy : కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ – జగన్

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దాంతో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నాం. దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో పండుగ సంతోషాన్ని చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: TTD Laddu Issue: జగన్‌పై కేంద్రమంత్రులు ఫైర్‌

 

Exit mobile version