Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్‌లో పురుగుల అన్నం

హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు.

Telangana: హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్శిటీ మెస్‌ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఇలానే పురుగుల ఆహారం పెట్టారు. దీంతో హాస్టల్ లో 10-20 మంది అనారోగ్యం పాలయ్యారు.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమస్యను లేవనెత్తారు. హైదరాబాద్‌లోని మహిళా హాస్టల్ నిర్వహణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించారు.

హైదరాబాద్‌లోని మహిళా హాస్టళ్లలో నాసిరకం ఆహారంపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. జనవరిలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ మహిళలు అంబర్‌పేట్‌లోని లేడీస్ హాస్టల్ కాంప్లెక్స్ ఎదుట విద్యార్థినులకు నాసిరకం భోజనం పెడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: YS Sharmila : ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ – వైస్ షర్మిల

Follow us