ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమం(Telangana Formation Day)లో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల అధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకున్నారని , తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తోందన్నారు.
ఇళ్లులేని పేదల కోసం “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసి, ఈ పథకానికి రూ. 22,500 కోట్లు కేటాయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. అంతేకాక హైదరాబాద్ పరిధిలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నగర అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి
రాష్ట్రంలో మొదటిసారిగా కులగణన చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. వందేళ్లలో జరగని ఈ కీలక చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కులసర్వే ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం కూడా కదిలిపోయి, వచ్చే జనగణనలో కులగణనను చేర్చనున్నట్లు ప్రకటించింది. భూ వివాదాలను నివారించేందుకు భూభారతి అనే డిజిటల్ ప్లాట్‌ఫాం తీసుకొస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Cabinet : కేబినెట్ లోకి రాములమ్మ..ఢిల్లీ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
మహిళలు, విద్యార్థులు, రైతులు వంటి విభిన్న వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ. 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేసాం . మహిళా సంఘాలకు QR కోడ్ కార్డులు ఇచ్చి, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే పథకం చేపట్టాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లు అందిస్తున్నాం . అదే విధంగా, రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయడంతో పాటు, సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నాం . ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.