Site icon HashtagU Telugu

Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు

Telangana Formation Day celebrations..Japanese representatives as special guests

Telangana Formation Day celebrations..Japanese representatives as special guests

Telangana Formation Day : జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ, హైదరాబాద్‌లోని నాంపల్లి గన్ పార్క్‌, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లలో ముఖ్య కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ దేశం నుండి ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ జపాన్ ప్రతినిధి బృందాన్ని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వం వహిస్తున్నారు. వారు ఇప్పటికే ఆదివారం (జూన్ 1) హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేపు జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే తెలంగాణ అవతరణ దినోత్సవ ముఖ్య వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ బృందం హాజరవుతారు. జపాన్ ప్రతినిధుల సందర్శన రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Read Also: Samantha-Raju Nidimoru : రెడ్ హ్యాండెడ్‌గా అతడితో దొరికిపోయిన సమంత

వేడుకల అనంతరం జపాన్-తెలంగాణ మధ్య పారస్పరిక సహకార ఒప్పందాన్ని(ఎంవోయూ) ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ మరియు కాలుష్య నివారణ అంశాల్లో కితాక్యూషూ నగర అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. జపాన్‌లో ఒకప్పుడు అత్యంత కాలుష్యభరితంగా ఉన్న కితాక్యూషూ నగరం ప్రస్తుతం ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు మోడల్‌గా మారింది. గాలి, నీరు, నేల భరత భరతంగా కాలుష్యానికి గురైన ఈ నగరం, శాస్త్రీయ విధానాలతో, ప్రజా భాగస్వామ్యంతో శుభ్రంగా మారింది. ఇప్పుడు ఈ నగరం ప్రపంచంలో ఎన్నో నగరాలకు పర్యావరణ రీహాబిలిటేషన్‌లో ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు. అక్కడి పర్యావరణ అభివృద్ధి మోడల్ని పరిశీలించారు. ఆ సందర్భంగా అక్కడి మేయర్ కజుహిసా టకేచీకి హైదరాబాద్‌ పర్యటనకు ఆహ్వానం పలికారు. సీఎం ఆహ్వానాన్ని స్వీకరించిన మేయర్ బృందంతో కలిసి ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఈ సహకారం ద్వారా హైదరాబాదులో కాలుష్యాన్ని తగ్గించేందుకు, పునరుత్పాదక శక్తి వనరులు పెంపొందించేందుకు, మున్సిపల్ నిర్వహణలో మెరుగుదల కోసం అనేక చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విధంగా జరిగే అంతర్జాతీయ స్థాయి మద్దతు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడనుంది.

Read Also:  Nara Lokesh : ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదు : మంత్రి లోకేశ్‌