Site icon HashtagU Telugu

MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ

Mla Quota Mlc Elections Brs Congress Mim

MLC Elections : తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 29వ తేదీ నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. రాజకీయ పార్టీలకు ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయి. వివరాలివీ..

Also Read :AP Budget : రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?

40 మంది పోటీ

ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ తమకు కూడా ఎమ్మెల్సీ (MLC Elections) ఇవ్వాలని ఎంఐఎం అడిగితే కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే ఛాన్స్ ఉంది.  తమ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ నేతలు తమ వర్గానికి రెండు సీట్లు ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు. నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్ నుంచి ఏకంగా 40 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేరుగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సమావేశం కావాలని అనుకుంటున్నారు.

Also Read :Bathukamma Kunta : మళ్లీ జీవం పోసుకున్న “బతుకమ్మ కుంట”

ఏ వర్గం నుంచి ఎవరెవరు .. ?