Site icon HashtagU Telugu

Telangana Elections: పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?

Telangana Election

Telangana Elections With Parliament..

Telangana Elections : పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ వర్గాల్లోని లేటెస్ట్ టాక్. ఆ విషయాన్ని బీజేపీ రాయలసీమ సీనియర్ లీడర్ టీ జీ వెంకటేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. సాధారణ ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) కేవలం ఐదు నెలలు మాత్రమే గాప్ ఉంది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు దృష్ట్యా లోక్ సభ ఎన్నికలతో తెలంగాణ, ఏపీ ఎన్నికలను పెట్టేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

ఢిల్లీ బీజేపీ ఇప్పటికే జమిలీ ఎన్నికల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాల పై కసరత్తు ఇంకా చేస్తూనే ఉంది. పలు సందర్భాల్లో జమిలీ గురించి మోడీ ప్రస్తావించిన అంశం తెలిసిందే.

బలమైన పోటీదారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్ ,కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా వెళితే ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకటే ఓటు పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీకి ఉంది.

అందుకే ఈసారి డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికల (Telangana Elections) కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక మేలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది. అలా అయితే కేసీఆర్ ను దెబ్బకొట్టడంతోపాటు బీజేపీకి అధికారం రాష్ట్రంలో దక్కుతుందని అంచనా వేస్తోంది.

Also Read:  Limca Book of Records: “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

2024లో మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ను జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ రాష్ట్రాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాయి. పార్లమెంట్ తోపాటు తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరిగితే కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతాడని.. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించవచ్చన్న ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తే అందరూ చెప్పే సమాధానం ‘డిసెంబర్’. కానీ ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్ద ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలంటే.. రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ ప్లాన్ చేసిందట. గత ఎన్నికల సమయానికి మోడీ తో సఖ్యతగా కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయన అనుకున్న విధంగా ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఈ సారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాని మోడీ , కేసీఆర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ ని రాజకీయంగా కొట్టాలని బీజేపీ వ్యూహంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సారి కెసిఆర్ సర్కార్ కు ఇరకాటం ఉండేలా మోడీ అండ్ టీమ్ చేస్తున్న ప్లాన్ బీ ఆర్ ఎస్ కు నిద్రలేకుండా చేస్తుందట.

Also Read:  Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే.!