Site icon HashtagU Telugu

Election Campaign : క్లైమాక్స్ కు చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం

Election Campaign End

Election Campaign End

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Election Campaign) క్లైమాక్స్ కు చేరుకుంది. గత నెల రోజులుగా అన్ని పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గల్లీ నేతలే కాదు ఢిల్లీ నేతలు సైతం తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుండడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్న ఈ కొద్దీ సమయంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే డబ్బుల పంపకాలు సైతం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ఓటుకు 2 వేల నుండి 4 వేల వరకు ఇచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇక ఈరోజు నేతల పర్యటనలు చూస్తే..

ఈరోజు ప్రియాంక గాంధీ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు భవనగిరిసభలో పాల్గోంటారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు గద్వాల్ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడంగల్లో భారీ బహిరంగ సభలో ప్రియాంక పాల్గొనున్నారు. అలాగే నర్సపూర్‌లో సాయంత్రం 4.30గంటలకు మల్లికార్జున ఖర్గే, స్థానిక అభ్యర్థికి మద్దతుగా నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఈరోజు మూడు నియోజకవర్గాల్లో జరిగే ప్రచారంలో పాల్గొంటారు.

ఇక బిజెపి నేతల పర్యటన చూస్తే..ఉదయం 10: 30 గంటలకు అమిత్‌షా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:15 నిమిషాలకు హుజూరాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. 12:40 కి పెద్దపల్లి బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్‌ షా.. మధ్యాహ్నం 2గంటలకు మంచిర్యాల బహిరంగ సభలో పాల్గొంటారు. 4:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Read Also : Rythu Bandhu : కేసీఆర్ కు షాక్..రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఈసీ