TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..!

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 06:50 AM IST

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఉదయం 9.45 గంటల తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మే 10 నుండి 14 వరకు నిర్వహించిన TS EAMCET 2023కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలకు మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు నేడు ఉదయం 9.30 గంటలకే విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని మంగళవారం ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

Also Read: LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్

ఎంసెట్ ఫలితాలు 2023 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

TS ఎంసెట్ పరీక్షలు 2023లో హాజరైన అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్‌ని ఉపయోగించి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించిన తర్వాత దీని కోసం అందించిన బాక్స్‌లో అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. TS ఎంసెట్ ఫలితాలు 2023 దాని ప్రకటన తర్వాత eamcet.tsche.ac.inలో తనిఖీ చేయవచ్చు.