Telangana DSC : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు రేపటి (గురువారం) నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలు.. ఆగస్టు 5 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు రెండుషిఫ్టులలో పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ(Telangana DSC) పరీక్షలున్న అభ్యర్థులు.. మార్నింగ్ ఎగ్జామ్ రాసిన చోటే రెండో పరీక్షకూ హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
మొత్తం 11,062 పోస్టులకుగానూ 2,79,966 మంది అప్లై చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సమయానికి 2,40,727 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మిగతా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లడంతో కొందరు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. వారి హాల్ టికెట్లలో తప్పులను సరిదిద్ది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల్లో.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఇక డీఎస్సీ పరీక్షలు వాయిదావేయాలని పలువురు అభ్యర్థులు నిరసనకు దిగినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అయితే త్వరలోనే ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇదే చివరి డీఎస్సీ(DSC Exams) కాదని స్పష్టం చేసింది.
Also Read :Ratna Bhandar : రత్న భాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచేది రేపే
- జులై 18న మొదటి షిఫ్ట్ – స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్ – ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
- జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
- జులై 22న స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్ పరీక్ష
- జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయొలాజికల్ సైన్స్ పరీక్ష
- జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 30న స్కూల్ అసిస్టెంట్ – సోషల్ స్టడీస్ పరీక్ష