Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. 2024 DSC ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను అక్టోబర్ 10, 2024 నుండి లెక్కించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్రెజరీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా నియమితులైన 11,062 మంది ఉపాధ్యాయులకు వర్తించనుంది.
Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత
వారి సేవల గణనలో స్పష్టత రావడంతో పాటు వేతన చెల్లింపులోనూ న్యాయమైన గుర్తింపు లభించనుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా నియమితులైన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌ను గుర్తించి, తగిన చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల లొంగుబాటు