Telangana Budget : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.
Also Read :Sunita Williams : క్షేమంగా భూమి మీదకు వచ్చిన సునీతా విలియమ్స్..నెక్స్ట్ సమస్యలు అవే !
ఈసారి బడ్జెట్‌లోని కీలక అంశాలివీ..
- ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు(Telangana Budget) కేటాయిస్తారు.
- మూసీ రివర్‌ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుంది.
- నీటిపారుదల, వ్యవసాయం, విద్య, రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు ఇస్తారు.
- సాగునీటి పారుదల శాఖ రూ.26 వేల కోట్లు అడిగింది. విద్యాశాఖ రూ.30 వేల కోట్లు అడిగింది.
- కొత్తగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకు రూ.11 వేల కోట్లు అవసరం.
- వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి, కరెంటు ఛార్జీలు పెంచకుండా రాయితీని భరించేందుకు కలిపి రూ.21 వేల కోట్లు కావాలి అని రాష్ట్ర ఇంధనశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి రూ.18 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.
- పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు ఇచ్చేందుకు రూ.2 వేల కోట్లు అవసరం.
- రైతుభరోసాకు రూ.15 వేల కోట్లు, 9.69 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.37,274 కోట్లు కావాలని అధికారులు ప్రపోజ్ చేశారు.
- రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి రూ.4 వేల కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.4 వేల కోట్లు అవసరం.
- వైద్య ఆరోగ్య శాఖకు ఈ సారి రూ.18 వేల కోట్ల వరకు మంజూరు చేసే అవకాశం ఉంది.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ఇప్పుడు ప్రతినెలా రూ.50 కోట్లు అందుతున్నాయి. వీటిని రూ.వంద కోట్లకు పెంచాలని వైద్యశాఖ కోరినట్లు సమాచారం.