AP And Telangana Debts : తెలంగాణ అప్పు ఎంత ? ఏపీ అప్పు ఎంత ?
ఏ రాష్ట్రానికి ఎక్కువ అప్పు ఉంది ?
తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3.66 లక్షల కోట్లు.. ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు..
ఈ లెక్క లేటెస్టు .. 2023 మార్చి నాటిది అని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Also read : Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో, ఏపీలోని 7 జిల్లాల్లో ఇవాళ వానలు
కాళేశ్వరం కోసం రూ 6528 కోట్ల అప్పు
2019 సంవత్సరంలో తెలంగాణ అప్పు రూ.1.90 లక్షల కోట్లు ఉండగా.. 2020 నాటికి అది రూ.2.25 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ. 2.71 లక్షల కోట్లకు చేరగా, 2022 మార్చికల్లా అది రూ. 3.14 లక్షల కోట్లకు పెరిగింది. ఇక 2023 మార్చి బడ్జెట్ సమయానికి తెలంగాణ అప్పు రూ.3.66 లక్షల కోట్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ 6528.95 కోట్ల అప్పు, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కోసం రూ. 4,263 కోట్ల అప్పును తెలంగాణ సర్కారు చేసింది. క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి టీఎస్సీఎస్సీఎల్ రూ. 15,643 కోట్ల అప్పు(AP And Telangana Debts) తీసుకుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కోసం రూ.1407.97 కోట్ల అప్పు చేసింది.
Also read : Vastu Tips: ఇంట్లో ఈ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?
నాలుగేళ్లలో రూ.2.64 లక్షల కోట్ల నుంచి రూ.4.42 లక్షల కోట్లకు
ఆంధ్రప్రదేశ్ అప్పు 2019 మార్చి నాటికి రూ.2.64 లక్షల కోట్లు ఉండగా 2020 మార్చి నాటికి రూ 3.07 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి రూ 3.53 లక్షల కోట్లున్న రాష్ట్ర అప్పు 2022 మార్చి నాటికి రూ 3.93 లక్షల కోట్లకు చేరింది. చివరకు 2023 మార్చి నాటికి మొత్తం అప్పు రూ.4.42 లక్షల కోట్లు అయింది.