Atmakur Case: జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది

ఈమధ్య కాలంలో బాగా చర్చకు తెరలేపిన సినిమా జై భీం. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలోఅమాయకుడైన ఆదివాసీ వ్యక్తిపై దొంగతనం నేరం మోపి, పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 05:10 PM IST

ఈమధ్య కాలంలో బాగా చర్చకు తెరలేపిన సినిమా జై భీం. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలోఅమాయకుడైన ఆదివాసీ వ్యక్తిపై దొంగతనం నేరం మోపి, పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. ఈ సినిమాను చూసిన జనాలందరూ పోలీస్ స్టేషన్లలో ఇలా జరుగుతుందా? పోలీసుల ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా? అని చర్చించుకున్నారు.సరిగ్గా ఈ సినిమా లాంటి సన్నివేశమే. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది.

Also Read : Apex Council : కేసీఆర్ అబ‌ద్ధాల‌పై కేంద్రం ఫోక‌స్ 

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని రామోజీ తండాకు చెందిన నవీన్ అనే యువకుడ్ని ఒక కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా అదే గ్రామానికి చెందిన వీరశేఖర్‌ అనే యువకుడిని ఎస్ఐ లింగం స్టేషన్‌కు పిలిపించారు. వీరశేఖర్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన కొద్దిసేపటికే అయన స్పృహతప్పి పడిపోయాడని, వచ్చి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు వీరశేఖర్‌ను ఇంటికి తీసుకెళ్లారు. అయితే వీరశేఖర్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో 200 మంది తండావాసులతో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణంగా హింసించారని,ఎస్ఐ తనను చిత‌క‌బా‌దా‌డని, కాళ్ల మీద పడ్డా కని‌కరం చూప‌లే‌దని బాధితుడు ఆరో‌పిం‌చారు.ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొల‌గిం‌చా‌లని బాధితుడి కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు డిమాండ్ చేశారు. వ్యవహారం ఎస్పీ వద్దకు చేరడంతో ఎస్ఐ లింగంను బదిలీ చేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోరాటం చేసినప్పుడల్లా, కేవలం కంటి తుడుపు చర్యగా నేరం చేసిన పోలీసులను వేరే చోటుకి బదిలీ చేస్తున్నారు తప్పా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. వీరిపై కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Also Read : కొవిడ్ రూల్స్ పాటించని స్కూళ్లు.. భయాందోళనలో తల్లిదండ్రులు!