Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్‌

అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. క‌మీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Congress MP Tweets

Congress MP Tweets

Congress MP Tweets: తెలంగాణలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్‌గా రాజ‌కీయం న‌డుస్తోంది. ఇక‌పోతే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెండు ఆసక్తిక‌ర ట్వీట్లు (Congress MP Tweets) చేశారు. అందులో కేటీఆర్‌ను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టం తెలుస్తోంది.

ఇంత‌కీ ఎంపీ ఆయ‌న ట్వీట్ల‌లో ఏం రాశారంటే.. అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. క‌మీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తెకు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది. కానీ, 2014 సెప్టెంబర్ 9న కేసీఆర్ స్వయంగా భూమిపూజ చేసిన వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం మాత్రం ఆయన దిగిపోయే వరకు మొండి గోడలతోనే ఉంది. రూ.50 కోట్లతో ఆ నాడే పూర్తి కావాల్సిన కళాక్షేత్రాన్ని రూ.95 కోట్లకు అంచనాలు పెరిగే వరకు
పూర్తి చేయకుండా వదిలేస్తే పది నెలల్లోనే రూ.45 కోట్లు విడుదల చేసి పూర్తి చేయించిన చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని పేర్కొన్నారు. ఇది కూడా మేమే కట్టాం అని మీరు చెప్పుకుంటే కాళోజీ ఆత్మ ఘోషిస్తదని అన్నారు.

Also Read: Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఐసీసీ కీల‌క నిర్ణయం

మ‌రో ట్వీట్‌లో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కేటీఆర్ పవిత్ర హృదయంతో (ఆయనకు పవిత్ర హృదయం ఉందో లేదో డౌటే… ఐనా) ఈ ఒక్క రోజైనా కుట్రలు, కుతంత్రాలను పక్కన పెట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ పథకం ప్రకారం కలెక్టర్, ఇతర అధికారుల పై దాడి కుట్రను అమలు చేసిన సురేష్ మీ పార్టీ నాయకుడే అని మీరే ప్రకటించారు. సురేష్ కు భూ సేకరణ పరిధిలో ఏడు ఎకరాల పొలం ఉందని కూడా మీరే ప్రకటించారు. అధికారుల విచారణలో అసలు ఆ గ్రామంలో సురేష్ కు గానీ, ఆయన సోదరుడికి గానీ ఇంచ్ భూమి కూడా లేదని
విస్పష్టంగా తేలింది. దీనికి మీ సమాధానం ఏమిటి కేటీఆర్!? ఇందుకే కదా మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది అని ట్వీట్ చేశారు.

  Last Updated: 15 Nov 2024, 06:43 PM IST