Site icon HashtagU Telugu

Manifesto Politics: కాంగ్రెస్ మేనిఫెస్టోని చిత్తు కాగితంలా తీసిపడేసిన కవిత

Manifesto Politics

Manifesto Politics

Manifesto Politics: ఎన్నికల మేనిఫెస్టులపై రాజకీయ రగడ మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టో రాజకీయాలకు తెరలేపుతున్నాయి. బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిందని ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానికి కల్వకుంట్ల కవిత స్పందిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని తీసిపారేసింది. దీంతో మేనిఫెస్టో రగడ మొదలైంది.

బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైందని విమర్శించారు కవిత. కాంగ్రెస్ గ్యారెంటీలను టిష్యూ పేపర్లుగా వర్ణించిన ఆమె అమరజ్యోతి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ నివాళులర్పించగల ధైర్యం ఉందా అని, అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయని ఎద్దేవా చేశారు కవిత. తెలంగాణాలో ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్ అని విమర్శించారు. ఈ క్రమంలో బీజేపీని ఎండగట్టారు కవిత. అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరింది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి, రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది, గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు అవుతుంది అంటూ జోస్యం చెప్పిందామె. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో ఉందని, పేదల వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తుందని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత.

తెలంగాణలో 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ. 3 లక్షల 15 వేలకు చేరిందని చెప్పారు కవిత. దీన్ని బట్టి చూస్తే.. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మెనిఫోస్టో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మెనిఫెస్టో తయారు అయిందని అన్నారు. బీఆర్ఎస్ మెనిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారని ధీమా వ్యక్తం చేశారు కవిత.

Also Read: Pooja Hegde Bikini : మరోసారి బికినీ తో నిద్ర లేకుండా చేసిన పూజా హగ్దే