Site icon HashtagU Telugu

Congress – 55 : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల

Congress 55

Congress 55

Congress – 55 :  కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆదివారం ఉదయం 9.05 గంటలకు తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది.  రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగానూ 55 స్థానాలకు అభ్యర్థుల పేర్లను డిక్లేర్ చేసింది. ఇందులో మల్కాజిరిగిని మైనంపల్లి హన్మంతరావుకు,  మెదక్ ను మైనంపల్లి రోహిత్ రావుకు, కొడంగల్ ను రేవంత్ రెడ్డికి, బెల్లంపల్లి సీటును  గడ్డం వినోద్‌ కు, మంచిర్యాల సీటును  ప్రేమ్‌సాగర్ కు, నిర్మల్‌ ను వినయ్ కుమార్ కు, బోధన్ ను సుదర్శన్‌ రెడ్డికి, ఆర్మూర్‌ ను వినయ్‌కుమార్ రెడ్డికి కేటాయించారు.  అక్టోబర్ 18న కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర ప్రారంభమయ్యేలోపు మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తుపై రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Empty Stomach: ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. అయితే మీకు సమస్యలు వచ్చినట్లే..!