Site icon HashtagU Telugu

T Congress Campaign : ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం.. “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..”

t congress campaign

t congress campaign

Telangana Congress Campaign : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు (Political Parties) ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య ప్రచార జోరు తారాస్థాయికి చేరుతుంది. ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టో లను తెలియజేస్తూ ఓట్లర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సభలు , సమావేశాలు , బస్సు యాత్రలే కాదు సోషల్ మీడియా (Social Media) ను సైతం గట్టిగా వాడుకుంటున్నారు. ఎవరికీ వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ లో ప్రచారం చేస్తా ఉంటె.. కాంగ్రెస్ (Congress) టీవీ లలో ప్రచారం చేస్తూ పల్లె ప్రజలకు , మాస్ జనాలకు దగ్గర అవుతుంది. ‘మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి’ అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తుంది. ఈ వీడియో లో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేయని హామీలను వీడియోలో హైలైట్ చేసారు.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ను పోలిన వ్యక్తి కారులో వచ్చి ఓటు అభ్యర్థిస్తే.. వివిధ వర్గాల వారు అంశాల వారీగా ఆయన్ను నిలదీసినట్లు.. చివరికి కారు పంక్చరైనట్లు వీడియో రూపొందించి ప్రచారం మొదలుపెట్టారు. ‘పదేండ్ల అహంకారం పోవాలంటే.. పదేండ్ల అవినీతిని తరమాలంటే.. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అని పేర్కొంది.

Also Read:  Rahul Gandhi – Varun Gandhi : వరుణ్ గాంధీతో రాహుల్ గాంధీ భేటీ.. అందుకేనా ?

మరో ప్రచారంలో కేసీఆర్ పోయిన వ్యక్తి ప్రచారానికి వచ్చినప్పుడు, TSPSC పేపర్ లీకేజీ, యువత మరియు యువతకు నిరుద్యోగ భృతి, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, 2BHK ఇళ్ల పంపిణీలో వైఫల్యం మరియు కాళేశ్వరం స్కామ్ గురించి యువకులు, మహిళలు మరియు రైతులు అతనిని ప్రశ్నించారు. ఓటర్లు ఇకపై బీఆర్‌ఎస్‌ నాయకుల అబద్ధాలను నమ్మరని, ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారును పంక్చర్‌ చేస్తారని వీడియో లో చూపించారు. ఇలా కాంగ్రెస్ రూపొందించిన వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి.

Read Also : Pawan Kalyan : బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్.. బిజెపి నేతలను నిరాశ పరిచాడా..?