Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ ట్వీట్.. అత్యవసర సమీక్ష

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ రోజు ఉదయం 11 గంటలకు అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Telangana Cm Cm Revanth Operation Sindoor Indian Army India Pakistan Congress

Operation Sindoor :  పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు..  ‘‘నేను తొలుత ఒక బాధ్యతాయుత భారతీయ పౌరుడిగా భారత సైనిక దళాలకు అండగా నిలబడతా. వారిని బలపరుస్తా. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉన్న ఉగ్రవాద ఫ్యాక్టరీలపై భారత సైన్యం దాడులు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భాన్ని మనం మనదేశ జాతీయ సంఘీభావం కోసం వాడుకుందాం. అందరం ఏకమై నిలుద్దాం. అందరం ఏకమై గొంతు కలిపి ఒకే స్వరంతో వాణిని వినిపిద్దాం. జైహింద్’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

Also Read :Operation Sindoor: 9 ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్

ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ రోజు ఉదయం 11 గంటలకు అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్షిస్తారు. దేశరక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతం. ఎన్నో డిఫెన్స్ విభాగాలకు హైదరాబాద్ నిలయం. అందుకే హైదరాబాద్‌లోని అన్ని భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. ఈ అంశంపై ఇవాళ జరిగే సమీక్షా సమావేశంలో  అన్ని విభాగాల ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారు. ఈరోజు సాయంత్రం తెలంగాణలో జరిగే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమాలను కూడా సీఎం స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. దీంతో డిప్యూటీ సీఎంకు రేవంత్ ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోవాలని సూచించారు.

  Last Updated: 07 May 2025, 10:22 AM IST