CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పదిరోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం న్యూయార్క్‌కు చేరుకోవడంతో పర్యటన ప్రారంభమైంది. ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు ఐటి మరియు పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కూడిన అతని ప్రతినిధి బృందానికి ప్రవాస భారతీయ సంఘం నుండి ఘన స్వాగతం లభించింది.
అమెరికాలో పర్యటనలో సీఎం ఎన్నారైలను సంప్రదించి, దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు సహకరించాలని కోరారు. తెలంగాణా కాంగ్రెస్ విజయంలో తమ గణనీయ పాత్రను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి ఎన్నారైల సహకారం కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్న విషయాన్నీ వారితో పంచుకున్నారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ పై ఎన్నారైలు ప్రశంసలు కురిపించారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరూ కష్టపడాలని మూకుమ్మడిగా నినదించారు. ఇక తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతూ.. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్, అర్టిఫిషియల్ రంగాల్లో దూసుకెళ్తున్నాదని చెప్పారు.
ముఖ్యమంత్రి తన పర్యటనలో కాగ్నిజెంట్ సీఈఓ మరియు సిగ్నా నుండి సీనియర్ అధికారులతో సహా కీలక అధికారులతో సమావేశం కానున్నారు. కాగా ఈ రోజు సీఎం రేవంత్ అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. అలాగే అమెరికాలో ఉన్న అనేక ఇతర కంపెనీల యజమానులతో చర్చలు జరుపుతారు.
Also Read: Janhvi Kapoor : జాన్వి సెంటిమెంట్.. దేవర ఏం జరుగుతుంది..?