Site icon HashtagU Telugu

CM Revanth Thanks To Venkaiah Naidu: మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడికి ధ‌న్య‌వాదాలు తెలిపిన సీఎం రేవంత్‌..!

CM Revanth Thanks To Venkaiah Naidu

CM Revanth Thanks To Venkaiah Naidu

CM Revanth Thanks To Venkaiah Naidu: తెలంగాణ‌లో రైత‌న్న‌ల‌కు అందించే పంట‌ రుణ‌మాఫీపై సీఎం రేవంత్ స‌ర్కార్ (CM Revanth Thanks To Venkaiah Naidu) ఇటీవ‌ల మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే రేపు (జూలై 18) రూ. ల‌క్ష‌లోపు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే రేవంత్ స‌ర్కార్ రైతు రుణ‌మాఫీ మార్గ‌ద‌ర్శ‌కాలను తెలుగులో విడుద‌ల చేయ‌టంతో స‌ర్వ‌త్రా ప్ర‌శ‌సంలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలుగులో మార్గద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌డంపై మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

వెంక‌య్య నాయుడు ఏమ‌ని ట్వీట్ చేశారంటే.. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా.అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు గారికి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

Also Read: TPCC: ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

అయితే వెంక‌య్య నాయుడు ట్వీట్‌పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మాజీ ఉప రాష్ట్ర‌పతి వెంక‌య్య నాయుడికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.