IT Raids : ఐటీ దాడుల‌పై `గులాబీ ద‌ళం`మంత్రాంగం

తెలంగాణ వ్యాప్తంగా సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల హ‌డావుడి కొన‌సాగుతోంది.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 01:24 PM IST

తెలంగాణ వ్యాప్తంగా సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల హ‌డావుడి కొన‌సాగుతోంది. వీటిని ఆపేందుకు టీఆర్ఎస్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది. ఆ సంస్థ‌ల కార్యాల‌యాల ఎదుట ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. హ‌ఠాత్తుగా మంత్రి మ‌ల్లా రెడ్డి, ఆయ‌న కుమారుడు, అల్లుడు, కూమార్తె ఇళ్ల‌లో ఐటీ సోదాలకు దిగ‌డంతో గులాబీ బాస్ అప్ర‌మ‌త్తం అయ్యారు. భ‌విష్య‌త్ ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తున్నారు.

మంత్రి మ‌ల్లారెడ్డి, ఆయ‌న బంధువులు, స‌న్నిహితులు, స్నేహితులు ఇళ్ల‌పై ఐటీ దాడుల‌తో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంద‌రు తెలంగాణ భ‌వ‌న్లో భేటీ అయ్యారు. త్వ‌ర‌లోనే కీల‌క నేత‌ల‌కు ఈడీ నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఎప్పుడు ఎవ‌ర్ని ఎటు వైపు నుంచి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు చుట్టుముడ‌తాయోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Also Read:  Gujarat Elections : కేసీఆర్ లో గుజ‌రాత్ స‌ర్వే గుబులు! బీజేపీ వైపే ఆత్మ‌సాక్షి స‌ర్వే!!

గ‌త వారం బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర‌, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, డీకే అరుణ త‌దిత‌రులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను క‌లిశారు. రెండు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేసి టీఆర్ఎస్ పార్టీలోని అవినీతిప‌రుల జాబితాను అందించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మైనింగ్ అక్ర‌మాల‌పై ఈడీ దాడులు చేసింది. మ‌రో న‌లుగురు మంత్రులకు ఈడీ నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఈడీ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ ను విచారించిన సంద‌ర్భంగా మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హ‌రం బ‌య‌ట ప‌డింది. ఆయ‌నిచ్చిన వాగ్మూలం ప్ర‌కారం ఈడీ నోటీసులు ఇస్తుంద‌ని భావిస్తున్నారు.

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ కేసు దాదాపుగా క్లోజ్ అయింది. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ దాన్ని తిర‌గ‌తోడుతున్నారు. ముంబాయ్ కేంద్రంగా బ‌య‌ట‌ప‌డిన డ్ర‌గ్స్ కేసుకు లింకు తెలంగాణ‌లో తొరికింది. ఆ రోజున హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ నుంచి సీబీఐ కొన్ని ఆధారాల‌ను సేక‌రించింది. వాటి ఆధారంగా బెంగుళూరు లింకుల‌ను కూడా బ‌య‌ట‌కు తీసింది. కానీ, అర్థాంత‌రంగా ఆ కేసు విచార‌ణ ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ కేసు విచార‌ణ ఫైల్ ను దమ్ముదులుపుతున్నార‌ని తెలుస్తోంది. ఆ కేసు సీరియ‌స్ విచార‌ణ జ‌రిగితే, ప్ర‌భుత్వంలోని కీల‌క నేత అరెస్ట్ కు దారితీసే అవ‌కాశం ఉంద‌ని గులాబీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌ల‌యింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన అధిష్టానం ప్ర‌తిగా ఉద్య‌మానికి సిద్ధం కావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వినికిడి. ఇలాంటి ప‌రిస్థితుల్లో గులాబీ బాస్ ఏమి చేస్తారో చూద్దాం.

Also Read:  KCR New Year Gift: తెలంగాణ ల్యాండ్ ఓనర్స్ కు ‘కేసీఆర్’ న్యూయర్ కానుక!