Site icon HashtagU Telugu

Telangana Cabinet : రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ..ఈ అంశాలపై చర్చ

Telangana Cabinet

Telangana Cabinet

తెలంగాణ ప్రభుత్వం రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అధ్యక్షతన కీలక క్యాబినెట్ సమావేశాన్ని (Telangana Cabinet) నిర్వహించనుంది. ఈ భేటీలో రాష్ట్రంలో పాలనా పరమైన కీలక విషయాలు, ముఖ్యంగా వర్షాకాల సీజన్ ప్రారంభం, పథకాల అమలు ప్రణాళికలు మరియు రాజకీయంగా ముందున్న ఎన్నికల నేపథ్యం , స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై ఈ భేటీలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Health Tips: పాల‌కూర అధికంగా తింటున్నారా? అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చే ఉంటాయి!

ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల చెల్లింపు, వడ్లకు బోనస్ సాయంపై మంత్రులు చర్చించనున్నారు. వానాకాలం సాగు నిమిత్తం రైతులకు మద్దతుగా నిధుల విడుదలకు రూపురేఖలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అలాగే కొత్తగా పాస్‌బుక్ పొందిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలనే దిశగా నిర్ణయం తీసుకోవచ్చు. రైతాంగానికి ఇది శుభవార్తగా మారే అవకాశం ఉంది.

అలాగే ఈ భేటీలో ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుపై, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ప్రజలకు వలస పోకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలపై కూడా కీలకంగా చర్చించనున్నారు. ప్రజల నిత్యజీవితానికి ముడిపడిన ఈ అంశాలపై స్పష్టత ఇచ్చే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో రేపటి క్యాబినెట్ భేటీపై ప్రజల ఆసక్తి భారీగా పెరిగింది.