ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet) భేటీ జరగనుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంపై ఊహాగానాలు నెలకొన్న తరుణంలో “ఇందిరమ్మ ఇళ్లు” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే యువతకు నూతన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన “రాజీవ్ యువ వికాసం”పై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
Health Tips : ఈ గ్లూటెన్ రహిత పిండితో చేసిన చపాతీలు తినడం ఎంతో ఆరోగ్యం..!
రైతాంగ సమస్యలకూ ఈ భేటీలో ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వానాకాలం సీజన్ సాగు ప్రారంభించనున్న తరుణంలో రైతులకు అవలంబించాల్సిన విధానాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే యాసంగి పంటకు సంబంధించిన పెండింగ్ భరోసా చెల్లింపులపై ప్రభుత్వం చురుగ్గా స్పందించనున్నట్లు సమాచారం. అలాగే ధాన్యం కొనుగోలు వ్యవహారం, ఎంఎస్‌పీ (MSP) అమలు విషయాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డీఏల పెంపు, బదిలీలపై కూడా మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ తుది రూపు గురించి చర్చ జరగనుంది. అత్యంత ఆసక్తికర అంశంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్ నివేదికలో ఉన్న విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఇది పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశముంది. మొత్తంగా చూస్తే, ఈ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు వేదికగా మారబోతున్నది.