Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (సరైన పేరు ఇది) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీకి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులంతా హాజరవుతారు.
Drunken Brawl: మద్యం మత్తులో యువతి హంగామా.. పోలీసులకు ఛాలెంజ్..!
ఇప్పటి వరకు ఇదే తొలిసారి
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ కేబినెట్ సమావేశం జరగని తరహాలో, ఈసారి ఒక ప్రత్యేక విధానంలో భేటీ జరుగుతోంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలు కేబినెట్ మీటింగ్ హాల్‌లో నిర్వహించేవారు. కానీ ఈసారి మాత్రం సీఎం మీటింగ్ హాల్‌లోనే 19వ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.
18 సార్లు సమావేశం – 315 అంశాలపై చర్చ
రెవంత్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన కొత్త ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నుంచి ఇప్పటివరకు 18 సార్లు కేబినెట్ భేటీ జరిపింది. ఇందులో దాదాపు 315 పైచిలుకు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి జరిగే సమావేశంలో గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితిపై సమీక్షించనున్నారు. ఇప్పటికే చేపట్టిన పథకాల పురోగతిపై కీలకంగా చర్చించే అవకాశముంది.
అత్యంత కీలక సమావేశంగా భావిస్తున్న ఈ భేటీలో…
- ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల అమలుపై సమీక్ష
- కొత్త పాలసీలు, పథకాల రూపకల్పనపై చర్చ
- ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలు
ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్ముందు ప్రభుత్వం దిశానిర్దేశానికి ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉంది.