సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గ్యారెంటీ హామీలలో ఇప్పటికే రెండు హామీలు ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు ను అమలు చేయగా..ఇప్పుడు మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు ఆమోదం తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని, అలాగే, తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ తీర్మానాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు (Telangana Cabinet Meeting Highlights) చూస్తే..
- తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం
- తెలంగాణ అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’
- వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ (TS).. టీజీగా (TG) మార్పు
- రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయం
- తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపునకు నిర్ణయం
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం, కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేసేందుకు ఆమోదం
- సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.