Telangana Budget: బడ్జెట్‌కు తెలంగాణ‌ కేబినెట్ ఆమోదం

2024-25 ఓటాన్ బ‌డ్జెట్‌ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

  • Written By:
  • Updated On - February 10, 2024 / 10:31 AM IST

Telangana Budget: 2024-25 ఓటాన్ బ‌డ్జెట్‌ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను పెట్టనున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయని ఆర్థిక మంత్రి భట్టి విక్ర‌మార్క చెప్పారు. అలాగే చెప్పిన అన్ని ప‌థ‌కాలు అమలు చేస్తామ‌న్నారు.

Also Read: Suhas: సోషల్ మీడియాలో ఎమోషనల్ లెటర్ షేర్ చేసిన సుహాస్.. ఇంకో హ్యాట్రిక్ ఇస్తారని నా ప్రయత్నం అంటూ?

తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి

ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశం ఖమ్మం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవంగా విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. జిల్లా నుంచి మహ్మద్ రజబ్ అలీ తర్వాత భట్టి వరుసగా 4సార్లు గెలుపొందడం గమనార్హం. 2009లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా, డిప్యూటీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షనేతగా కూడా ఆయన వ్యవహరించారు. బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో మంత్రి భ‌ట్టి ప్రవేశపెట్టనున్నారు.

We’re now on WhatsApp : Click to Join