Cabinet Meeting : తెలంగాణ మంత్రివర్గం ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్‌లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ .. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Read Also: MLC : నాగబాబుకు ఎమ్మెల్సీ..తమ్ముడికి శుభాకాంక్షలు : అంబటి సెటైర్లు
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీలలో విలీన చేయాలని నిర్ణయించారు. దీంతో పట్టణ జిల్లాగా మేడ్చల్ మారుతుంది. సెర్ఫ్, మెప్మా విలీనంకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ములుగుతో పాటు మరికొన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో.. గ్రామ పంచాయతీల జాబితా నుంచి ఆ గ్రామాలను తొలగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇక మెట్రో రైల్ ఫేజ్-2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్ట్ లో మార్పులకు సంబధించి మరికొన్ని నిర్ణయాలు ఉండనున్నాయి.
బీసీ రిజర్వేషన్లపై క్యాబినేట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. భూభారతి చట్టం అమలు, LRS, మైనింగ్ యాక్ట్ అంశాలు కేబినెట్ లో చర్చకు వచ్చినట్లు సమాచారం. నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఆ జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కొంత శాతం వరకు రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణలో అది 15 శాతం ఉంది. అంటే వందలో 15 ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు. అయితే, ఆ జాబితాలోని కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ముందున్నాయి, మరి కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు.
Read Also: Chris Cairns: నడవలేని స్థితిలో న్యూజిలాండ్ క్రికెటర్?