Telangana Budget 2024-25: తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2024-25) ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం రూ.33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ.3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకంకు రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు, విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజా పంపిణీకి రూ.3,836 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు కేటాయించారు.
Also Read: KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు
అలాగే అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు.. మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు, రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై భట్టి కామెంట్స్
గత పాలకులు పదేళ్ల కాలంలో వివిధ కారణాలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోలేకపోయారని గ్రహించి.. మేము రాజకీయ బేసిజాలను పక్కన పెట్టాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో నేను ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను రెండుసార్లు స్వయంగా కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. నిన్నటి వరకు పలువురు కేంద్ర మంత్రులను మా క్యాబినెట్ సహచరులు కలుస్తూ ప్రతిపాదనలు ఇచ్చారు. ఏ ఒక్క ప్రతిపాదనకు కేంద్ర బడ్జెట్లో చోటు కల్పించకపోవడం పూర్తిగా రాజకీయ వివక్షగా మేం బలంగా విశ్వసిస్తున్నామని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
