Site icon HashtagU Telugu

BJP First List : 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. జాబితాలో ప్రముఖ నేతల పేర్లు ?

Karnataka Bjp

Bjp

BJP First List : అసెంబ్లీ పోల్స్ కోసం తొలి జాబితాను రిలీజ్ చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. నేడో, రేపో తొలి జాబితా విడుదల అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో దాదాపు 50 మంది అభ్యర్ధుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. ఈ లిస్టులో పేర్లున్న కీలక బీజేపీ నేతలలో.. కిషన్‌రెడ్డి (అంబర్‌పేట్), బండి సంజయ్, ఈటల రాజేందర్ (హుజురాబాద్), రఘునందన్‌రావు (దుబ్బాక), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), డీకే అరుణ (గద్వాల్), బాబు మోహన్‌ (అందోల్‌), కూన శ్రీశైలం గౌడ్‌ (కుత్బుల్లాపూర్)  ఉన్నారని సమాచారం. వీరితో పాటు ధర్మపురి అసెంబ్లీ స్థానాన్ని వివేక్ కు, వరంగల్ ఈస్ట్ ను ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు, ఉప్పల్ ను ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్ కు, సూర్యాపేటను సంకినేని వెంకటేశ్వరరావుకు, భూపాలపల్లిని చందుపట్ల కీర్తిరెడ్డికి, కల్వకుర్తిని టి.ఆచారికి, వర్దన్నపేటను శ్రీధర్ కు కేటాయించారని చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మానకొండూరును ఆరెపల్లి మోహన్ కు,  జగిత్యాలను బోగ శ్రావణికి, నిర్మల్ ను మహేశ్వర్‌రెడ్డికి, ముక్తల్ ను జలంధర్‌రెడ్డికి, మంథనిని సునీల్‌రెడ్డికి, మహబూబాబాద్ ను హుస్సేన్‌నాయక్ కు, జనగామను అందెల శ్రీరాములుయాదవ్ కు, ఖానాపూర్ ను రమేష్‌ రాథోడ్ కు, నల్లగొండను శ్రీనివాస్‌గౌడ్ కు ఇస్తారని తెలుస్తోంది. ఈమేరకు దాదాపు 50 మంది పేర్లతో కూడిన జాబితాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం లభించగానే విడుదల చేయనున్నారు. ఇక రెండో జాబితా తయారీ కూడా ఇప్పటికే పూర్తవగా,  మరో వారం రోజుల్లో దాన్ని రిలీజ్ చేసే అవకాశం (BJP First List) కనిపిస్తోంది.

Also Read:  DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నేడు డీఏ పెంపుపై క్లారిటీ..!