Farm Bill : మోదీ నిర్ణయంపై టీ.బీజేపీ సైలెంట్..ఎందుకో తెలుసా?

రైతు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడంతో ఇన్ని రోజులు ఆ చట్టాలకు మద్దతు తెలిపినవారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు.

  • Written By:
  • Updated On - November 20, 2021 / 11:39 AM IST

రైతు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడంతో ఇన్ని రోజులు ఆ చట్టాలకు మద్దతు తెలిపినవారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు.రైతుల సమస్యపై తెలంగాణాలో గత పదిరోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. రైతులను ఇబ్బంది పెట్టె ప్రభుత్వాలు మీవంటే మీవనివిమర్శించుకుంటున్నాయి.

తెలంగాణలోని వరి రైతుల సమస్యకు పరిష్కారం చూపకపోతే ఢిల్లీపై పోరాటం చేస్తామని, ఉత్తర భారతదేశంలో పోరాడుతున్న రైతులకు టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని కేసీఆర్ ప్రకటించిన వెంటనే మోదీ వెనక్కి తగ్గి చట్టాలను రద్దుచేస్తున్నామని ప్రకటించారని, ఈ క్రెడిట్ కేసీఆర్ దేనని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.మోదీ నిర్ణయంపై బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ అంశంపై ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా సోషల్ మీడియాలో గానీ, మీడియా చర్చల్లో గానీ ఎవరు పాల్గొనకూడదని కమలనాధులు అనుకున్నారట.

కానీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర అంశాలైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్లు తదితర అంశాలపై పోరాటాలు చేయాలని దానికి త్వరలోనే ఒక షెడ్యూల్ ఇస్తామని పార్టీ అగ్ర నేతలు క్యాడర్ కు చెప్పినట్టు సమాచారం.