Telangana BJP Manifesto : బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో..ఇదేనా..?

అమిత్ తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతున్నట్లు బిజెపి శ్రేణులు చెపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిజెపి ప్రకటించనున్న మేనిఫెస్టో లో ప్రధానంగా ఈ హామీలు

  • Written By:
  • Publish Date - November 13, 2023 / 04:53 PM IST

ఇప్పటికే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టో ( Manifesto) లతో ప్రజల ముందుకు వెళ్తుంటే..బిజెపి (BJP) మాత్రం ఇంకా తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేయకపోవడం ఫై కార్యకర్తలు ఆగ్రహం గా ఉన్నారు. ఈ తరుణంలో ఈ నెల 17 న కేంద్ర మంత్రి అమిత్ షా (Amith Sha) తెలంగాణ లో పర్యటించబోతున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ లో బిజెపి తలపెట్టిన భారీ సభల్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ సందర్బంగా అమిత్ తమ మేనిఫెస్టో (Telangana BJP Manifesto) ను రిలీజ్ చేయబోతున్నట్లు బిజెపి శ్రేణులు చెపుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిజెపి ప్రకటించనున్న మేనిఫెస్టో లో ప్రధానంగా ఈ హామీలు ఇవ్వబోతున్నారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…
  • మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో
  • అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం
  • ప్రతీ వ్యక్తికి జీవిత భీమా
  • ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
  • వరి ధర క్వింటాకు రూ.3100
  • పెళ్లైన ప్రతీ మహిళకు ఏడాదికి రూ.12 వేలు
  • సిలిండర్ రూ.500కే
  • తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
  • రాష్ట్రవ్యాప్తంగా జమ ఔషధీ కేంద్రాలు
  • వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు
  • యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్
  • రిలీజియస్ టూరిజం పెంపు
  • ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు
  • పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు వర్తింపు
  • ఫీజుల నియంత్రణ కు చర్యలు
  • మహిళ సంఘాలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటివి ప్రకటించబోతున్నారట.

Read Also : Mulugu Seethakka : నన్ను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారు – ములుగు సీతక్క