Pocharam Srinivas Reddy : కొత్త చరిత్ర లిఖించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఎలా ?

Pocharam Srinivas Reddy:  శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి  విజయం సాధించారు.

Published By: HashtagU Telugu Desk
Pocharam Polls

Pocharam Polls

Pocharam Srinivas Reddy:  శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి  విజయం సాధించారు. ఆయన 23,582పైగా ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఈ గెలుపుతో పోచారం శ్రీనివాస్ రెడ్డి చరిత్రను తిరగరాశారు. ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన తర్వాత ఎన్నికల్లో ఎవరూ గెలుపొందలేదు. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు పోచారం బ్రేక్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. భూపాలపల్లి నియోజవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో  మధుసూదనాచారి  పరాజయం చవి చూశారు. ఆ తర్వాత గండ్ర బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్పీకర్ గా ఉన్న వ్యక్తులు ఎక్కువగా శాసనసభ కార్యకలాపాలపైనే దృష్టి పెడతారని, నియోజవర్గానికి అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. స్పీకర్‌గా ఉండే వ్యక్తి అధికార, ప్రతిపక్షాల మధ్య సమన్వయం చేస్తుంటారు. స్పీకర్ గా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో తాను గెలిచిన పార్టీని రిప్రజెంట్ చేయలేరు. దీంతోనే సాధారణంగా స్పీకర్‌గా ఉన్న వ్యక్తి తర్వాత ఎన్నికల్లో గెలవడని చెబుతుంటారు. కానీ ఈసారి పోచారం ఆ అపోహకు(Pocharam Srinivas Reddy)చెక్ పెట్టారు.

Also Read: Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి

  Last Updated: 03 Dec 2023, 01:50 PM IST