Site icon HashtagU Telugu

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు!

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions) నేడు ప్ర‌శ్నోత్న‌రాలు ర‌ద్దు చేశారు. అలాగే వృద్ధాప్య పింఛన్ పథకం అమలు, రాష్ట్రంలో మహిళా శక్తి కాంటీన్‌ల‌ ఏర్పాటు, ఫోర్టు సిటీ, ఒగ్గు కథ కళాకారుల కోసం సమాఖ్య, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, రాష్ట్రంలో త్రాగునీటి ఎద్దడి, మైనార్టీ వర్గాల కోసం ఉప ప్రణాళిక, మూసీ నది పునరుర్జీవ ప్రాజెక్టు, గిరిజన సంక్షేమ శాఖలో పండిట్, పిఈటి పోస్టుల అప్ గ్రేడేషన్ వంటి అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

నిన్న శాసనసభలో ఆమోదం పొందిన బీసీ బిల్లు విద్యా ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ పై రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.

అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కీల‌క బిల్లులు

విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు.

గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. తెలంగాణ శాసనసభలో ఈరోజు 2 బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు.

Also Read : Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?

మరో నాలుగు బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు