Site icon HashtagU Telugu

Telangana Budget 2024 – 25 : ఎల్లుండికి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Bhatti Vikramarka (2)

Bhatti Vikramarka (2)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను (Telangana Assembly Session) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ 2024-25ను (Telangana Budget 2024 – 25) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రకటించిన వెంటనే సభను స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27న (శనివారం) తిరిగి సభ ప్రారంభమవుతుందని తెలిపారు. భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్‌కు రూ.3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వ‌స‌తులు క‌ల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏలో మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు రూ.500 కోట్లు, వ్యవ‌సాయానికి రూ.72,659 కోట్లు, ఉద్యాన‌వ‌నం రూ.737 కోట్లు, ప‌శుసంవ‌ర్ధక శాఖ‌కు రూ.1,980 కోట్లు కేటాయించారు. ఇక రూ.500 గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం కోసం రూ.723 కోట్లు, గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ.2,418 కోట్లు ప్రతిపాదించారు.

ఇదే సందర్బంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6,71,757కోట్ల అప్పు చేసిందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్ర రుణం పది రెట్లు పెరిగిందని, తమ ప్రభుత్వం రూ.42,892 కోట్లు చెల్లించిందని చెప్పుకొచ్చారు. బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని , ప్రాజెక్టుల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.72,659 కోట్లను రైతాంగానికి కేటాయించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఆ నిధులను వినియోగించనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Read Also : Coffe: నెల రోజులు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?