తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Election 2023 ) సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే ఉంది. నేటి రోజున (నవంబర్ 30) రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఈసారి ఎన్నికలు తగ్గ పోరుగా ఉండబోతున్నాయి. బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పార్టీల మధ్య నువ్వా – నేనా అనేంతగా పోరు జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన గులాబీ..మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది మీము..మాకు ఓ ఛాన్స్ ఇవ్వండి..తెలంగాణ ను ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం అంటున్నారు కాంగ్రెస్..కేంద్రం లో ఉన్న ప్రభుత్వం..రాష్ట్రంలో కూడా ఉంటె బాగుంటుంది..మాకు ఓ ఛాన్స్ ఇవ్వండి అని బిజెపి అడుగుతుంది. ఇలా ఎవరికీ వారు తమ హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరింతగా పెంచుతూ ఈసారి ప్రజల వద్దకు వెళ్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో..? ఏ పథకం ఎవరికి ఉపయోగపడుతుందో..? మహిళల కోసం ప్రభుత్వం ఏం చేసిందో..? మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో..వంటివి ప్రజలకు వివరిస్తూ ఊరు , వాడ , పల్లె , పట్టణం ఇలా అన్ని చోట్ల ప్రచారం చేస్తూ వస్తున్నారు. సీఎం దగ్గరి నుండి మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ లు ఇలా ప్రతి BRS సభ్యుడి పార్టీ విజయం కోసం కష్టపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీల (Congress 6 Guarantee Schemes)తో ప్రజల ముందుకు వెళ్తుంది. ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారెంటీల కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందడం లేదో వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 20 వేల కార్డుల చొప్పున అన్ని నియోజకవర్గాలకు పంపి, మిగతా కార్డులను అభ్యర్థులు అవసరం మేరకు వినియోగించాలని పార్టీ సూచిస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు లక్ష్యంగా బీజేపీ (BJP) నేతలు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో జనగర్జన సభతో ప్రధాని మోదీ(PM MODI) ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రధాని తన సభల్లో పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటనలు చేశారు. ఎన్డీఏలో చేరుతామని సీఎం కేసీఆర్ తనతో చర్చించారని, కేటీఆర్‌ని సీఎం చేస్తానని చెప్పినట్లు నిజామాబాద్‌లో వెల్లడించి సంచలనం సృష్టించారు. సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీన్నే శాననసభ ఎన్నికల్లో తమ ప్రధాన అంశంగా మార్చుకుని బీజేపీ ముందుకు సాగుతోంది. ఇలా ఈ మూడు పార్టీలు తమ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరో ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారో..? ఎవర్ని గెలిపిస్తారో ..? అనేది చూడాలి.
Read Also : Paneer : మీరు ఈ ఫోటో చూస్తే..జీవితంలో పన్నీర్ తినరు..