Telangana alliance : BRS తో పొత్తు దిశ‌గా కాంగ్రెస్, `KC`సంకేతాలు!

తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు(Telangana alliance) స‌ఖ్య‌త ఉంటుంద‌ని కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్ర‌క‌టించారు

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 05:11 PM IST

తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు(Telangana alliance) అంశం పూర్తి స‌మ‌సిపోలేదు. ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తాజా ప్ర‌క‌టించారు. ఆయ‌న గాంధీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు. పైగా రాహుల్ కు బ్ర‌ద‌ర్ లాగా మెలుగుతుంటారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత ఆయా రాష్ట్రాల్లో పొత్తుల గురించి మీడియా ఎదుట ప్ర‌స్తావించారు. కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల త‌రువాత పొత్తులు ఉంటాయ‌ని సంకేతాలు ఇచ్చారు. ఆయ‌న చెప్పిన త‌రువాత అదే ఫైన‌ల్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు  అంశం పూర్తి(Telangana alliance)

ఇటీవ‌ల కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీనియ‌ర్ లీడ‌ర్ జానారెడ్డి చెప్పిన దానికి అనుగుణంగా కేసీ వేణుగోపాల్ (KC Venugopal)కూడా పొత్తుల గురించి చెప్పారు. తెలంగాణ‌కు చెందిన ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుల(Telangana alliance) గురించి మాట్లాడిన‌ప్పుడు కొంద‌రు ఎగ‌సి ప‌డ్డారు. భావ‌సారూప్య‌త ఉన్న పార్టీల‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌ని ప్లీన‌రీ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఏఐసీపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే కూడా అదే చెప్పారు. అయితే, ఇక్క‌డ వ‌చ్చిన చిక్క‌ల్లా ఎన్నిక‌ల ముందుగా పొత్తు ఉంటుందా? త‌రువాత పెట్టుకుంటారా? అనేది. అక్క‌డే తిక‌మ‌క కనిపిస్తోంది. అంతే త‌ప్ప‌, పొత్తు ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెబుతోంది.

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి,  జానారెడ్డి చెప్పిన దానికి అనుగుణంగా కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు (Telangana alliance) అనే అంశం గ‌త కొన్నేళ్లుగా త‌ర‌చూ వినిపిస్తోంది. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు కొంద‌రు కేసీఆర్ కు కోవ‌ర్టులు ఉన్నార‌ని, వాళ్లే పొత్తు అంటున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ లోకి ఒక గ్రూప్ ఆరోప‌ణ‌ల‌కు దిగింది. ఆ తరువాత పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కూడా అదే పంథాను సీనియ‌ర్లు కొంద‌రు కొన‌సాగించారు. అంతేకాదు, సీఎల్పీ నేత‌గా ఉన్న భ‌ట్టీ విక్ర‌మార్క్ ను కూడా రేవంత్ వ‌ర్గీయులు కొంద‌రు టార్గెట్ చేశారు. గిట్టన సీనియ‌ర్ల మీద కోవ‌ర్టుల ముద్ర వేసేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌ను బాగా ఉప‌యోగించుకున్నారు. ఇలాంటి పంథా ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అంశాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన జానా, కోమ‌ట‌రెడ్డి మీద దుమ్మెత్తి పోశారు.

రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి పనిచేయ‌డానికి

జాతీయ ఈక్వేష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ స‌మీక‌ర‌ణాలు మారుతుంటాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని అధికారం నుంచి దింపడానికి ఏ పార్టీతోనైనా క‌లిసి పనిచేసేందుకు సిద్దంగా కాంగ్రెస్ ఉంద‌ని అధిష్టానం చెబుతోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి పనిచేయ‌డానికి సిద్ధాంతాలు, రాజ‌కీయ అభిప్రాయ‌బేధాల‌ను కూడా పక్క‌న పెట్టేందుకు సిద్దంగా ఉంది. ఆ విష‌యాన్ని తాజాగా కేసీ వేణుగోపాల్ (KC Venugopal) చెప్ప‌డం కాంగ్రెస్ లోని ఒక గ్రూప్ ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వేదిక‌ను పంచుకోవ‌డానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డు. కానీ, ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మంటూ ఢిల్లీ అధిష్టానం సంకేతాలు ఇస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగే ప‌రిణామాల‌ను మాత్ర‌మే చెబుతోంది.

Also Read : Telangana Formation Day: ఎన్నికల పండుగ ‘ఆవిర్భావం’21 డేస్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు (Telangana alliance) ఉండ‌ద‌ని వ‌రంగ‌ల్ వేదిక‌గా ప్ర‌క‌టించిన రైతు డిక్ల‌రేష‌న్ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన యూత్ డిక్ల‌రేష‌న్ సంద‌ర్భంగా కూడా అదే వాయిస్ వినిపించారు. తెలంగాణ‌కు వ‌చ్చిన ఢిల్లీ పెద్ద‌ల ద్వారా పొత్తు ఉండ‌ద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పిస్తున్నారు. కానీ, అధిష్టానం మాత్రం జాతీయ ఈక్వేష‌న్ల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల‌తో ఆయా రాష్ట్రాల్లో క‌లిసి వెళ‌తామ‌ని చెబుతోంది. అంటే, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరుగా రాజ‌కీయ గేమ్ ఆడ‌తాయ‌న్న‌మాట‌. ఒక వేళ హంగ్ వ‌స్తే, క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఏ మాత్రం అడ్డులేకుండా ముందే ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లు సంకేతాలు(Telangana alliance) సానుకూలంగా ఇచ్చేస్తున్నారు. ఇక సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి బీఆర్ఎస్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని అధిష్టానంలోని పెద్ద‌లు చెబుతోన్న మాట‌.

Also Read : BRS Office: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం, పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు(Telangana alliance) పెట్టుకున్న మ‌రుక్ష‌ణం పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ మేర‌కు మీడియా స‌మావేశాల్లో క్లారిటీ ఇస్తున్నారు. కానీ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల ఆధార‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకుంది. దానికి కార‌ణం లేక‌పోలేదు. సుమారు 25 చోట్ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన ఎంఐఎం చివ‌రి నిమిషంలో వైదొలిగింది. ఫ‌లితంగా కాంగ్రెస్ కు ఆశించిన ఫ‌లితాలు వ‌చ్చాయి. అందుకే, ప్రాంతీయ పార్టీల‌ను ఐక్యం చేసేందుకు పెద్ద‌న్న పాత్ర‌ను కాంగ్రెస్ పోషించాల‌ని భావిస్తోంద‌ని కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి అడుగులు వేస్తారు? అనేది చూడాలి.=