Site icon HashtagU Telugu

Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు

Telangana Acb Formula E Racing Brs Leaders

Formula E Racing : ఫార్ములా ఈ కార్ రేసింగ్  వ్యవహారంలో కొందరు బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు తెరపైకి వస్తాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ ఏసీబీ రెగ్యులర్ ఎంక్వయిరీని మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే విధమైన టాక్ వినిపిస్తోంది. రేపో, ఎల్లుండో ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై కేసును నమోదు చేస్తారని తెలుస్తోంది. దానితో సంబంధమున్న వారికి నోటీసులు జారీ చేస్తారని సమాచారం.

Also Read :Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్​ పాలిమర్‌‌కు జై.. పెరుగుతున్న వినియోగం

2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌(Formula E Racing) చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న రెండోసారి (సెషన్‌-10) రేస్ నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌-అర్బన్‌ డెవల్‌పమెంట్‌(ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంఏయూడీ రూ.55 కోట్లు చెల్లించింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మున్సిపల్‌ శాఖ నుంచి ఏసీబీకి కంప్లయింట్ అందింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్‌లు, అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు పెద్దల పేర్లు వినిపించడంతో  కేసు నమోదుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సర్కారు నుంచి ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలిసింది.

Also Read :One State One RRB : ‘ఒక రాష్ట్రం.. ఒకే రీజియనల్ రూరల్ బ్యాంక్’.. విలీనాలు షురూ

ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లను విదేశీ కంపెనీలకు చెల్లించారని సీబీఐ వర్గాలు తెలిపాయి. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత  సీబీఐ ప్రొసీడ్ కానుంది. మునిసిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, వాటి ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు సీబీఐ నోటీసులను పంపనుంది. వారందరినీ విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు.  వాటి ఆధారంగా ఆనాటి  బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు పంపాలా ? వద్దా ? అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.